Telangana : జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎంతకాలమో తెలిస్తే?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని తెలంగాణ శాసన సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాదరావు ప్రకటించారు;

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని తెలంగాణ శాసన సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాదరావు ప్రకటించారు. స్పీకర్ ను అవమానించిన జగదీశ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రతిపాదన చేశారు. దీనికి స్పీకర్ ఆమోదించారు. అయితే స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
సమావేశాలు ముగిసేంత వరకూ...
శాసన వ్యవస్థను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి పంపాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు శాసనసభ నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెన్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు.