Ts Budget : 2.56 లక్షల కోట్లతో బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ నుప్రవేశ పెట్టారు.
తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ను హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1.89 లక్షల కోట్లుగా చూపించారు. క్యాపిటల్ వ్యయం కింద 29,728 కోట్లగా చూపారు. ఈ బడ్జెట్ లో దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించారు. పల్లె ప్రగతి ప్రణాళికకు 330 కోట్లు కేటాయించారు.
కేంద్ర వివక్ష....
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రానిది నిరంకుశ వైఖరి అని ఆయన అన్నారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. తల్లిని చంపి బిడ్డను బతికిస్తున్నారని ప్రతిసారీ బీజేపీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. పాలనలో ప్రభుత్వం రాజీలేని వైఖరిని వ్యవహరించిందన్నారు. ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
దళితులను ఆదుకునేందుకు....
దళిత జాతిని ఆర్థికంగా ఆదుకునేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అతిపెద్ద నగదు బదిలీ పథకంగా చరిత్ర కెక్కిందన్నారు. మార్చి నాటికి నలభై వేల కోట్ల రూపాయలతో నాలుగువేల కుటుంబాలకు లబ్ది చేకూరపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాదికి దళిత బంధు పథకం ద్వారా రెండు లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హరీశ్ రావు చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల్లో అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. నూతన మెడికల్ కళాశాలల ఏర్పాటు కోసం ఈ బడ్జెట్ లో వెయ్యికోట్లు కేటాయించినట్లు హరీశ్ రావు తెలిపారు.