Telangana : 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.;

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకూ పరీక్షను నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఐదు నిమిషాల వరకూ...
హాల్ టిక్కెట్లు విడుదల కావడంతో పాటు వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లను కూడా అనుమతిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభం అయిన ఐదు నిమిషాల వరకు మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని, తర్వాత అనుమతించమని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. పరీక్షలు జరిగే రోజు ఆ ప్రాంతంలో నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.