KCR : కేసీఆర్ కు అల్టిమేటం.. అసెంబ్లీ రాకుంటే ఫాంహౌస్ ను ముట్టడిస్తామని వార్నింగ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మల్లన్నసాగర నిర్వాసితులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు;

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మల్లన్నసాగర నిర్వాసితులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు బహిరంగ లేఖను వారు విడుదల చేశారు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి తమ సమస్యలపై మాట్లాడాలని మల్లన్న సాగర్ నిర్వాసితులు కోరారు. లేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీకి ఈరోజు రాకపోతే ఫామ్ హౌస్ కు వచ్చిఆందోళన నిర్వహిస్తామని, అక్కడే టెంట్ వేసుకుని వంటా - వార్పూ చేపడతామని కూడా మల్లన్న సాగర్ నిర్వాసితులు కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
సమస్యలు ప్రస్తావించాలంటూ...
తమ సమస్యలను ప్రస్తావించకుండా, అసెంబ్లీకి రాకుండా ఉంటే ఊరుకునేది లేదని కూడా వారు బహిరంగ లేఖలో తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ఉందని వారు అంటున్నారు. మధ్యాహ్నం వరకూ చూస్తామని, అసెంబ్లీకి రాకుంటే తామే ఫాం హౌస్ కువస్తామని లేఖతో పేర్కొన్నారు. దీంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.