SlBC Accident : మృతదేహాల ఆనవాళ్ల అయినా లభిస్తాయా? బంధువుల్లో ఆందోళన

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి;

Update: 2025-03-19 03:34 GMT
SlBC Accident : మృతదేహాల ఆనవాళ్ల అయినా లభిస్తాయా? బంధువుల్లో ఆందోళన
  • whatsapp icon

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేటికి 26వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్స్ చేరుకున్నాయి. దాదాపు నెల రోజులవుతున్నా ఏడుగురు కార్మికులకు సంబంధించిన ఆనవాళ్లు కూడా తెలియడం లేదు. అసలు టన్నెల్ లో ఎంత లోతు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. నిష్ణాతులైన సహాయక బృందాలకు కూడా అంతు చిక్కకుండా ఈ చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ శునకాలు గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు జరపాలన్నా అక్కడ పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటితో సాధ్యపడటం లేదు.

26రోజుల నుంచి...
ఏడుగురు కార్మికులు పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి బంధువులు కూడా కొద్ది రోజులు వేచి చూసి ఇంటికి వెళ్లిపోయారు. టన్నెల్ లో పనులను నిలిపేసి మరీ 26 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కనీసం మృతదేహాలనైనా అప్పగిస్తారన్న ఆశ ఇన్నాళ్లు బంధువుల్లో ఉండేది. కానీ రాను రాను రోజుల గడిచే కొద్దీ మృతదేహాలు కూడా దొరికే పరిస్థితులు కనిపించకపోవడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
గుర్తించిన ప్రాంతంలో...
మృతదేహాలను గుర్తించడానికి టన్నెల్ వద్దనే ఫోరెన్సిక్ నిపుణులను సిద్ధంగా ఉంచారు. డీ1 వద్ద మృతదేహాలుంటాయని అంచనా వేసి అక్కడ తవ్వకాలు జరపాలన్నా ఆ ప్రాంతంలో తొమ్మిది మీటర్ల మేరకు బురదపేరుకుపోయింది. వాటిని తొలగించే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తవ్వకాలు జరిపేందుకు కూడా సాధ్యపడటం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. అయితే తమ ప్రయత్నం చివర వరకూ చేస్తామని, ప్రయత్నంలో లోపం లేకుండా చేసి లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఉద్దేశ్యంతో రెస్క్యూ టీంలున్నాయి. మొత్తం మీద రోజురోజుకూ మృతదేహాలు దొరుకుతాయన్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నట్లే అనిపిస్తుంది.


Tags:    

Similar News