Telangana : రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు;

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్ కు వరసగా బెదిరింపులు వస్తుండటంతో ఈరోజు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తుండటంతో రాజాసింగ్ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. మంగళహాట్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.
సెక్యూరిటీని ఉపయోగించుకోవాలని...
4+1 సెక్యూరిటీని ఎక్కడకు వెళ్లినా ఉపయోగించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ఖచ్చితంగా వినియోగించాలని కూడా కోరారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఎదైనా సమావేశాలకు బయటకు వెళుతుంటే పోలీసులకు తగిన ముందస్తు సమాచారం అందించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.