Harish Rao : హైకోర్టులో హరీశ్ రావుకు గ్రేట్ రిలీఫ్
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది;

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్టలో ఆయనపై నమోదయిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు హరీశ్ రావుపై కేసు నమోదు అయింది. హరీశ్ రావు, రాధాకిషన్ లను ఈకేసులో నిందితులుగా చేరుస్తూ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
అయితే తనపై నమోదయిన కేసును కొట్టి వేయాలంటూ హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలను వినింది. ఈ కేసును కొట్టి వేస్తూ తీర్పును చెప్పింది. దీంతో హరీశ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు కు హైకోర్టులో ఊరల లభించినట్లయింది. తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.