Telangana : రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ లో సన్నరకం వడ్ల కొనుగోలుపై బోనస్ కు సంబంధించిన నిధులను విడుదల చేసింది.;

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ లో సన్నరకం వడ్ల కొనుగోలుపై బోనస్ కు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఈ సీజన్ లో సన్న వడ్ల కొనుగోలు చేయడానికి అదనంగా బోనస్ చెల్లించడానికి పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సన్నరకం వడ్లకు...
తెలంగాణలో సన్నరకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ను ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. గతంలోనూ ఈ ప్రకారం చెల్లించింది. రానున్న సీజన్ లోనూ ఇదేరకమైన బోనస్ చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో భాగంగా నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని పార్టీ నేతలుచెబుతున్నారు