క్రీ.శ. 1125 నాటి జడ్చర్ల జైన శాసనాన్ని కాపాడుకోవాలి!

జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-06-24 05:05 GMT

 జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న క్రీ. శ. 1125వ సంవత్సరం జనవరి 21వ తేదీ నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి మూడో సోమేశ్వరుని కుమారుడు, కందూరు నాడు యువరాజైన, మూడో తైలపుడు పాలిస్తుండగా, మూల సంఘానికి చెందిన మేఘచంద్ర భట్టారకుడు వేయించిన జైన శాసనంలో గంగాపురంలోని పార్శ్వనాథ చైత్య అలయ ప్రస్తావన ఉందని, ప్రస్తుతం గంగాపురం వద్ద గల గొల్లత్తగుడి ఇటుక ఆలయమే జైన చైత్యాలమని, దాన్ని పునరుద్ధరించి, ఈ శాసనాన్ని అక్కడకు తరలించాలని అఖిలభారత ప్రాచీన ఆలయ జీర్ణోధ్ధరణ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్ కె జైన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.




స్థానిక వెంకటేశ్వర ఆలయంలో నున్న క్రీ.శ. 1162 నాటి కందూరు చోళ వంశానికి చెందిన రెండో ఉదయన చోడుడు, కోడూరు స్వయంభు సోమేశ్వరనాధుని నిత్య అర్చనలకు 5 గోకర్ణ సింగ రూకలను, గంగాపురం నుంచి వచ్చే ఆదాయాన్ని దానం చేసినట్లుగా ఉందని శివనాగిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కో-ఛైర్మన్ ముఖేష్ కుమార్ జైన్, స్థానిక ఆలయ పూజారి, వారసత్వ ప్రేమికుడు అన్ష్ జైన్ పాల్గొన్నారు. ఆ శాసనం పై ఉన్న సున్నాన్ని తొలగించాలని శివనాగిరెడ్డి ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News