రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన 18 టీములు
ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెస్యూ టీం, డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఇలా వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన..
గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. పలు జిల్లాలలో వరదల్లో చిక్కుకుపోయిన వారు.. వరదల్లో కొట్టుకుపోయిన వారు..వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 టీములు రంగంలోకి దిగి పలువురి ప్రాణాలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తీరు ఎంతో అభినందనీయం. ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెస్యూ టీం, డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఇలా వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన 18 టీములు రంగంలోకి దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 1421 మందిని ఫైర్ డిపార్ట్మెంట్ ప్రాణాలతో కాపాడారు. భూపాలపల్లి లోని మొరంచపల్లి లో 70 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దపల్లిలోని మథాని గోపాల్ పూర్ ఇసుక రీచ్ లో 17 మంది చిక్కుకుపోయారు. వీరందరూ సహాయం కోసం ఎదురు చూశారు.