సిరిసిల్ల జిల్లా, చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య బహరేన్ జైల్లో

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య (62) అనే వ్యక్తి బహరేన్ జైలులో.

Update: 2024-08-10 14:42 GMT

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య (62) అనే వృద్ధుడు జనవరి నుంచి బహరేన్ జైలులో మగ్గుతున్నాడు. చీర్లవంచ గ్రామం మధ్య మానేరు నీటిపారుదల ప్రాజెక్టులో ముంపుకు గురవడం వలన నర్సయ్య కుటుంబం ప్రస్తుతం అగ్రహారం పునరావాస కాలనీలో నివసిస్తున్నారు. ఇతను గతంలో నివసించిన గోపాల్ రావుపల్లి గ్రామ రేషన్ కార్డు, ఓటరు కార్డు ఇప్పుడు అతను భారతీయుడు అని నిరూపించుకోవడానికి ఆధారంగా పనికివస్తున్నాయి. 

నర్సయ్య ను భారత్ కు తెప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారు. 

బహరేన్ ప్రభుత్వ సంస్థ 'లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ' 2024 జనవరి 8న బహరేన్ లోని భారత రాయబారికి ఒక లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతని పాస్‌పోర్ట్ అందుబాటులో లేదు, పోయినట్లు నివేదించబడింది. చట్టవిరుద్ధమైన స్థితిలో ఉన్నాడు. ఇతన్ని బహరేన్ నుంచి భారత్ కు పంపించడం (డిపోర్ట్) కోసం ఇండియన్ ఎంబసీ వారు 'అవుట్ పాస్' (తాత్కాలిక పాస్‌పోర్ట్) జారీ చేయాలని ఆ లేఖలో కోరారు. బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ వారు ఆగస్టు 4న హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయానికి ఒక లేఖ రాశారు. మానువాడ నర్సయ్యను అతని ఫోటోను  ధ్రువీకరించాలని కోరారు. 

28 ఏళ్ల క్రితం... 1996 సెప్టెంబర్ 23న బహరేన్ దేశానికి చేరుకున్నప్పుడు మానువాడ నర్సయ్య వయస్సు 34 ఏళ్ళు. ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేళ్ళ పాటు తాపీ మేస్త్రీ గా పనిచేసి ఆగస్టు 1999 లో వర్క్ పర్మిట్ ముగిసినట్లు  ఎల్ఎంఆర్ఏ రికార్డుల వలన తెలుస్తున్నది. హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వారు1989 సెప్టెంబర్ 22న పాస్‌పోర్ట్ జారీ చేశారు. బహరేన్ ఇండియన్ ఎంబసీ వారు 2001 నవంబర్ 18న పాస్ పోర్ట్ ను రెనివల్ చేశారు. ఇప్పుడు దాని గడువు ముగిసిపోయింది. 

మానువాడ నర్సయ్య విషయాన్ని బహరేన్ లోని సామాజిక కార్యకర్త నోముల మురళి, హైదరాబాద్ లోని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను శోధించి (సెర్చ్) చేసి మానువాడ నర్సయ్య చిరునామా కనుక్కొని, సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ద్వారా నివేదిక తెప్పించి బహరేన్ లోని ఇండియన్ ఎంబసీకి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి జులైలో సంబంధిత అధికారులకు 'ఎక్స్' ద్వారా ట్వీట్ చేశారు.

Tags:    

Similar News