Tenth Results : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో...బాలికలే ఫస్ట్
తెలంగాణలో పదో తరగతి పరీక్షలలో 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు
పదోతరగతి పరీక్షల్లో బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణలోని 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. 3,927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయిని తెలిపారు. బాలుర ఉత్తీర్ణత శాతం 89.42 శాతంకాగా, బాలికల ఉత్తీర్ణత శాతం మాత్రం 93.23 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
నిర్మల్ జిల్లా ప్రధమ స్థానం...
99 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి శాతంలో నిలిచిందని చెప్పారు. వికారాబాద్ లో అత్యల్పంగా ఉత్తీర్ణత శాతం నమోదయింది. జూన్ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పదోతరగతి పరీక్షలకు 5 లక్షల మంది వరకూ పరీక్షకు హాజరయ్యారు. రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కు కూడా అవకాశముందని ఆయన తెలిపారు.