జాతరకు ముందే జన జాతర
జాతర కంటే ముందే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పెద్దయెత్తున భక్తులు మేడారం కు వస్తున్నారు.
మేడారం జాతరకు ఇంకా నెలరోజుల సమయం ఉంది. అయితే జాతర కంటే ముందే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పెద్దయెత్తున భక్తులు హాజరవుతున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో నిన్నటి నుంచి మేడారంలో భక్తుల రాక ఎక్కువయింది. సంక్రాంతి సెలవులు కూడా కలసి రావడంతో మేడారానికి భక్తులు పోటెత్తిన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వచ్చే నెల 16నుంచి....
వచ్చే నెల 16వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. అయితే ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉంటారని భావించి ముందుగానే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు తరలి వస్తున్నారని ఆలయ కమిటీ చెబుతుంది. జంపన్న వాగులో స్నానాలు చేసి సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.