Telangana : అరవింద్ కుమార్‌‌ను అక్కడికే ఎందుకు బదిలీ చేశారో తెలుసా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలను చేస్తుంది

Update: 2023-12-17 11:42 GMT

aravind kumar ias 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలను చేస్తుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఏ ప్రభుత్వం కొత్తగా వచ్చినా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీలు చేయడం షరా మామూలే. తమ పాలనకు ట్యూన్ అయ్యే వారిని ఎంచుకుని వారికి మంచి పోస్టులను ఇస్తుంది. తమకు నచ్చని వారిని ఏ ప్రభుత్వమైనా పక్కన పెట్టేస్తుంది.

పదకొండు మంది ....
మరోసారి తెలంగాణలో పదొకొండు మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్‌ను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది. అరవింద్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.


Tags:    

Similar News