KTR : కేటీఆర్ ముందున్న ఆప్షన్లు ఏంటి? ఏసీబీ ఏం చేయబోతుంది?

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు;

Update: 2025-01-07 05:46 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏసీబీ అధికారుల నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ నెల 9వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీనికి న్యాయవాదులను కూడా వెంట అనుమతించేది లేదని చెప్పారు. ఈరోజు కోర్టును కేటీఆర్ తరుపున న్యాయవాది నాటు టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వాలని కోరినా న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో కేటీఆర్ ను ఈ నెల 9వ తేదీన విచారించేందుకు ఏసీబీకి అన్ని అవకాశాలు లభించినట్లయింది.

సుప్రీంకోర్టుకు వెళ్లే...
కేటీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏసీబీ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కేటీఆర్ తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఇదేరకమైన వాదనలను కేటీఆర్ తరుపున న్యాయవాదులు వినిపించనున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి 54 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు చెల్లించడమే కాకుండా తిరిగి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ గ్రీన్ కో కంపెనీ బాండ్లను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకు రానున్నారు. క్విడ్ ప్రోకో జరిగిందన్న వాదనను న్యాయస్థానం ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏసీబీ యాక్షన్ షురూ...
కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా రద్దు కావడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే ఆయనను ఈ నెల 9వ తేదీన ఎటూ విచారించే అవకాశముండటంతో ఈరోజు కు ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు లేవని కూడా చెబుతున్నారు. విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించనున్నందున కొన్ని రోజుల్లోనే కీలక పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంభవించనున్నాయి. మరి కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారా? లేదా? అన్నది మరికాసేపట్లో తేలనుంది. హైదరాబాద్, విజయవాడల్లోని గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ




Tags:    

Similar News