Raithu Bharosa : రైతు భరోసా విధివిధానాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

రైతు భరోసా విధివిధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు

Update: 2024-12-31 11:57 GMT

రైతు భరోసా విధివిధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసాపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ఎలాంటి విధివిధానాలను ఇంకా నిర్ణయించలేదన్నారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం పంట వేసిన వారందరికీ రైతు భరోసా వస్తుందన్న హామీని తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు. మీడియాలో వస్తున్నప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.

ప్రతి రైతుకు...
తాము ఇంకా రైతు భరోసా విధివిధానాలపై నిర్ణయం తీసుకోలేదని, అయితే పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా అందుతుందని మాత్రం తాను చెప్పగలనని ఆయన స్పష్టీకరించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్న ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని, అందుకు సంబంధించిన కసరత్తులు ఇటు అధికారులు, అటుతాము చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Full View


 

Tags:    

Similar News