NRI Chinta Praveen:వరంగల్ టికెట్ రేసులో అమెరికా ఎన్నారై చింత ప్రవీణ్

వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని దాదాపు యాభై మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట, భూపాలపల్లి ఆరు స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది

Update: 2024-03-01 06:11 GMT

NRI Chinta Praveen:వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని దాదాపు యాభై మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట, భూపాలపల్లి ఆరు స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే ఎంపీ సీట్లలో వరంగల్ కూడా ఒకటి అనే ప్రచారంతో టికెట్ కోసం పోటీ పెరిగింది.

ఏఐసీసీ కార్యదర్శి, ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షులు రోహిత్ చౌదరిని గురువారం (29.02.2024) ఢిల్లీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, అమెరికా విభాగం సభ్యులు చింత ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని చింత ప్రవీణ్ ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. యువకుడు, విద్యావంతుడు అయిన చింత ప్రవీణ్ అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ రేసులో సీనియర్లతో పోటీ పడటం విశేషం.

Tags:    

Similar News