హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నేడు మరో ఫ్లై ఓవర్ ప్రారంభం
హైదరాబాద్ వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. షేక్ పేట్ లోని ఫ్లైఓవర్ ను నేడు ప్రారంభించనున్నారు.;

హైదరాబాద్ వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. షేక్ పేట్ లోని ఫ్లైఓవర్ ను నేడు ప్రారంభించనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి వెళ్లేవారికి ప్రయాణం మరింత సులువు కానుంది.
330 కోట్లతో...
షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను 333 కోట్ల రూపాయలతో నిర్మించారు. దాదాపు 2.75 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మొహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వారికి ప్రయాణం సులువుగా మారనుంది. సమయం కూడా తగ్గనుంది.