తిరుపతికి వందే భారత్ రైలు ఎప్పుడంటే?

తెలంగాణకు మరో వందేభారత్ రైలు రానుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది

Update: 2023-03-25 03:18 GMT

తెలంగాణకు మరో వందేభారత్ రైలు రానుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీన రైలును ప్రారంభించేందుకు రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న ఈ వందేభారత్ రైలు విశేష ఆదరణ పొందుతుందని రైల్వే అధికారులు కూడా భావిస్తున్నారు.

ఏడు గంటలకు...
ప్రయాణ సమయం ఏడు గంటలు ఉంటుందని అంచనా వినపడుతుంది. ఏడుగంటల్లో సికింద్రాబాద్ నంుచి తిరుపతికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్లగొండ, గుంటూరు మీదుగా నెల్లూరు తిరుపతి మార్గంలో తిరుపతి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సమయం ఏంటన్నది ఇంకా నిర్ధారించలేదు. సమయం ప్రయాణానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తే వందే భారత్ రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News