అంబేద్కర్ పై వ్యాఖ్యలకు కాంగ్రెస్ నిరసన

బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శాసనసభ్యులు నిరసనకు దిగారు

Update: 2024-12-19 07:17 GMT

బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శాసనసభ్యులు నిరసనకు దిగారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.


అసెంబ్లీ ప్రాంగణంలో...

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఖబడ్దార్ అమిత్ షా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంబేద్కర్ ఫొటోలు పట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News