Telangana : నేడు తెలంగాణ అసెంబ్లీలో నాలుగు కీలక బిల్లులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు భూ భారతి, రైతు భరోసా వంటి అంశాలపై చర్చ జరగనుంది.

Update: 2024-12-19 03:12 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు భూ భారతి, రైతు భరోసా వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గంట ముందుగానే అసెంబ్లీ ఆవరణకు వచ్చి ఎమ్మెల్యులు, ఎమ్మెల్సీలతో సమావేశమై సభలో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు నాలుగు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.


భూ భారతిపై...

తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపైనా, రైతు భరోసా నిధుల విడుదలపైనా నేడు స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈరోజు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News