ఆదిలాబాద్ లో రెండు పులులు.. ఎక్కడెక్కడంటే....?
కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెద్దపులి సంచరిస్తుంది. జిల్లాలోని కౌటాల మండలం గుండాయి పేటలో పెద్దపులి రైతుకు కనిపించింది.
కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెద్దపులి సంచరిస్తుంది. జిల్లాలోని కౌటాల మండలం గుండాయి పేటలో పెద్దపులి రైతుకు కనిపించింది. మిరప చేనులో పని చేస్తున్న రైతులకు పెద్దపులి కనిపించడంతో అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు వచ్చి పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ఈ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతుందని నిర్ధారించారు.
పనులకు ఒంటరిగా...
ఒంటరిగా పొలం పనులకు నులకు వెళ్లవద్దని గ్రామస్తులకు అటవిశాఖ అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం ఎక్కువగా ఉంది. మంచిర్యాల జిల్లా రాళ్ల పేట , వేంపల్లి లో పులి స్థానికులకు కనిపించింది. ట్రాకింగ్ కెమెరాకు కూడా పలి చిక్కింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now