కేటీఆర్ మీడియాతో చిట్ చాట్.. వారిని వదిలపెట్టబోమంటూ?
స్థానిసంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
స్థానిసంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సభలో ప్రవేశపెట్టబోయే పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని కేటీఆర్ తెలిపారు. బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు.
తమ ప్రతిపాదనలను...
తమ పార్టీ ఇచ్చిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అవసరమైతే సభలో డివిజన్‌కుపట్టుబడతామన్న కేటీఆర్ ఆరు నెలల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని, కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తమ పార్టీ ఏ అంశంపైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్పటి వరకూ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని చెప్పారు.