తిరుమలపై మాజీ మంత్రి సంచలన కామెంట్స్
తెలంగాణ భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణ భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తిరుమలను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శనం విషయంలోనూ, వసతి గృహాల కేటాయింపులో వివక్ష జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుమలలో తెలంగాణ రాజకీయ నేతలకు, వ్యాపారవేత్తలకు తిరుమలలో న్యాయంజరిగిందన్నారు.
వివక్ష పాటిస్తున్నారని...
కానీ ఇప్పుడు మాత్రం వివక్ష పాటిస్తున్నారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకే మాదిరిగా వ్యవహరించాలని, కానీ తేడా చూపుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు దీనిని సరిచేయాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now