అగ్నీవీరుల నియామకానికి దరఖాస్తులు

ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నారు

Update: 2023-02-16 02:59 GMT

ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెళ్లికాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24కు సంబంధించి ఈరోజు నుంచి అగ్నిపథ్‌ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుదిగడువుగా నిర్ణయించారు.

ఆన్‌లైన్ లో పరీక్ష...
ఈ ఏడాది ఏప్రిల్‌ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ చేసిన అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


Tags:    

Similar News