Telangana: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‎ఛార్జి మంత్రులు వీళ్లే

In Charge Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా..

Update: 2023-12-24 16:10 GMT

incharge ministers

In Charge Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ప్రజలకు అన్ని రకాల మేలు జరిగేలా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం తమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటి అవుతున్నారు. శాఖపరమైన లోపాలను, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్‎ఛార్జులను నియమించారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి త్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఇన్‎ఛార్జి మంత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు.

కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‎ఛార్జి మంత్రులు వీళ్లే..

1. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌.

2. ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

3. రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

4. వరంగల్‌- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

5. మహబూబ్‌నగర్‌ – దామోదర రాజనర్సింహ.

6. కరీంనగర్‌ – ఎన్‌.ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

7. మెదక్‌ – కొండా సురేఖ.

8. నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు.

9. నిజామాబాద్‌- జూపల్లి కృష్ణారావు.

10.ఆదిలాబాద్‌ – సీతక్క.

Full View


Tags:    

Similar News