అరికెపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి వివాదానికి కారణమైన PAC

ఇందులో మెజారిటీ 22 మంది సభ్యులు ఉంటారు.. లోక్ సభ నుండి 15 మంది, రాజ్యసభ నుండి 7 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు..ఈ కమిటీ లోక్ సభ ఆధ్వర్యంలో నియమింపబడుతుంది...!!

Update: 2024-09-15 08:04 GMT

గత వారం రోజులుగా.. తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి, అరెకెపూడి గాంధీ మధ్య జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు, బూతు పురాణాలు, సున్నితమైన స్థానికత అంశం తెరమీదకు రావటం వీటన్నింటికీ కారణం..

""""అరికెపూడి గాంధీకి అసెంబ్లీ స్పీకర్ PAC చైర్మన్ పదవిని కట్టబెట్టటం..."""

అసలు అరికెపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఓ మినీ యుద్ధమే జరిగింది అని చెప్పవచ్చు...!!!

PAC చర్మైన్ పదవి అనేది... అధికార పార్టీ తరువాత అసెంబ్లీలో ఏ పార్టీకి సంఖ్యాబలం ఉందో...ఆ పార్టీ అధ్యక్షుడు సూచించిన ఎమ్మెల్యేకి చైర్మన్ పదవిని కట్టబెట్టటం అనేది అసెంబ్లీ స్పీకర్ భాద్యత..!!

కానీ తెలంగాణ అసెంబ్లీలో దానికి విరుద్ధంగా జరిగింది..

అసెంబ్లీలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సూచించిన ఎమ్మెల్యే కి ఇవ్వకుండా... బీఆర్ఎస్ నుండి పార్టీ ఫిరాయించిన శెరిలింగంపల్ల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది..!!

ప్రతిపక్ష నేత సూచించిన ఎమ్మెల్యే కి ఇవ్వకుండా... పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎలా ఇస్తారని.. హరీష్ రావు ప్రశ్నించగా..తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నేనని అరికెపూడి గాంధీ, తనకు కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో..

కౌశిక్ రెడ్డి చీర ధరించి, గాజులు తొడుక్కో మని...,తను ఏ పార్టీ అనేది స్పష్టం చేయాలని లేకుంటే తన ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని,సవాల్ విసరడం, దానికి ప్రతి సవాల్ గా..తన ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయక పోతే..తనే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానని గాంధీ సవాల్ చేయడమే కాకుండా.. చెప్పినట్లు గానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాడి చేయడం...ఈ విధంగా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి..!!

అసలు PAC అంటే ఏమిటి..!!??

Public Accounts Committee తెలుగులో ప్రజా పద్దుల కమిటీ అని కూడా అంటారు..!!

దేశంలోని రాష్ట్రాల్లో... ప్రభుత్వ ఆదాయ వ్యయాలను లెక్కించేందుకు... పార్లమెంటు ఏర్పాటు చేసే కమీటీని PAC అంటారు..!!

ఇందులో మెజారిటీ 22 మంది సభ్యులు ఉంటారు.. లోక్ సభ నుండి 15 మంది, రాజ్యసభ నుండి 7 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు..ఈ కమిటీ లోక్ సభ ఆధ్వర్యంలో నియమింపబడుతుంది...!!

ఈ కమిటీ నిర్వర్తించే ముఖ్య విధులు..!!

* ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలను లెక్కించడం,

* ఆదాయ వ్యయాలలో లోపాలు,దుబారా ఖర్చులు, తప్పులు,లెక్కా పత్రం లేని ఖర్చులు,వంటి వాటిని పరిశీలించి పార్లమెంటు అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టడం..!!

* కాగ్ నివేదికను పరిశీలించడం...!!

* ప్రభుత్వ వార్షిక ఖాతాలను చెక్ చేయడం..!!

* ప్రభుత్వ శాఖల లోని ఆర్థిక అవకతవకలను కనిపెట్టడం, రెవెన్యూ రశీదులను పరిశీలించడం..పన్ను ఎగవేతలు, సుంకాలు విధించకపోవడం వంటి వాటిని తనిఖీ చేయడం..!!

ఈ పీఏసీ చేర్మన్ పదవి అనేది.. ""

అసెంబ్లీ లో ఎవరికీ ఎక్కువ సంఖ్యాబలం ఉంటే...ఆ పార్టీ అధ్యక్షుడు ప్రతిపాదించిన ఎమ్మెల్యే కి, అసెంబ్లీ స్పీకర్ పీఏసీ చేర్మన్ పదవిని కట్టబెట్టాలి"" ...!!

ఇంతకుముందు తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కూడా.., ప్రతిపక్ష కాంగ్రెస్ కి దక్కాల్సిన పీఏసీ చేర్మన్ పదవిని, ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీ లోని ఎమ్మెల్యే లను బీఆర్ఎస్ పార్టీ లోకి లాక్కొని, కాంగ్రెస్ సంఖ్యాబలం తక్కువ చేసి,అని పదవి MIM కి కట్టబెట్టి.. సంఖ్యాబలం ఎక్కువ ఉన్న పార్టీకే పీఏసీ చేర్మన్ పదవిని ఇచ్చామని సర్ధి చెప్పుకుంది..

కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీఏసీ చేర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ కి ఇవ్వకుండా... బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పిరాయించిన శెరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది...!!

అసలు ఈ పీఏసీ చేర్మన్ పదవి.. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ప్రతిపాదించిన ఎమ్మెల్యే కి ఇవ్వాలి...ఆ లెక్క ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు కి దక్కాలి...!!

కానీ అలా జరగలేదు..

ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన మాజీ పీఏసీ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఈ పీఏసీ వివాదంపై స్పందించారు..!!

పీఏసీ చేర్మన్ పదవి అనేది ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ సూచించిన ఎమ్మెల్యే కి ఇవ్వాలి..కానీ అధికార పార్టీకి మద్దతు తెలిపే వ్యక్తికి ఇవ్వకూడదు..

ఇలాగే వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో పీఏసీ చేర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా.. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చినట్లు తెలిపారు..!!
















Tags:    

Similar News