Super Police : తన ప్రాణాలను ఫణంగా పెట్టి నలభై మందిని రక్షించిన నవీన్ కుమార్‌కు జీవన్ రక్ష అవార్డు
అగ్ని ప్రమాదం నుంచి నలభై మందిని రక్షించిన ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ జీవన రక్ష అవార్డు దక్కింది
అగ్ని ప్రమాదం నుంచి నలభై మందిని రక్షించిన ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ జీవన రక్ష అవార్డు దక్కింది. ఆయన అగ్నిప్రమాదంలో నలభై మంది ప్రాణాలను కాపాడటమే కాకుండా, తన ఎడమ కాలును కూడా పోగొట్టుకున్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలను అభినందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డుకు నవీన్ కుమార్ ను ఎంపిక చేశారు.
తన ప్రాణాలను లెక్క చేయకుండా...
వివిధ రంగాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 31 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవన్ రక్ష పదక్ అవార్డును అందించనున్నారు. 31 మందిలో తెలంగణకు చెందిన నవీన్ కుమార్ ఒకరు. ఆయన ఆర్మ్ రిజర్వ్‌డ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రమాద సమయంలో అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి మరీ ప్రజలను కాపాడారు.
ఖమ్మం జిల్లాలో జరిగిన..
గత ఏడాది ఏప్రిల్ నెలలో ఖమ్మం జిల్లాలోని చీమలపాడు మండలంలోని కారెంపల్లి గ్రామంలోని ఒక పూరి గుడెసెలో అగ్ని ప్రమాదం సంభవించింది. బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పేల్చిన బాణాసంచా గుడెసె మీద పడటంతో అది అంటుకుంది, గుడిసెలో ఉన్న సిలిండర్ పేలి ఇద్దరు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో తన ప్రాణాలొడ్డి నలభై మందిని రక్షించిన నవీన్ కుమార్ కు అత్యంత పురస్కారం జీవన రక్ష దక్కింది.