గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవినీతి నిరోధశక శాఖ అధికారులు దూకుడు పెంచారు.;
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవినీతి నిరోధశక శాఖ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్, విజయవాడల్లోని గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఈకేసుకు సంబంధింి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్ తో పాటు మచిలీపట్నంలోని గ్రీన్ కో కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.
ఎన్నికల బాండ్లకు సంబంధించి...
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత ఎన్నికల సందర్భంగా బాండ్లను కొనుగోలు చేసిన అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇటు ఫార్ములా ఈ రేసు కేసులో యాభై నాలుగు కోట్ల రూపాయల మేర నిధులు పంపిన తర్వాత దానికి అనుబంధ సంస్థ అయిన గ్రీన్ కో కంపెనీ బాండ్లను కొనుగోలు చేయడంపైనే ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ