National Highway : ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. టోల్‌ప్లాజాల వద్ద గంటల గంటలు

నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిలో రష్ ఎక్కువగా ఉంది;

Update: 2024-01-12 03:26 GMT
National Highway : ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. టోల్‌ప్లాజాల వద్ద గంటల గంటలు

lot of rush on the national highway

  • whatsapp icon

నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిలో రష్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువ మంది సొంత వాహనాలలో సొంత ఊళ్లకు బయలుదేరడంతో ఈరోజు ఉదయం నుంచే రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల వద్ద విపరీతమైన ర‌ష్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి వాహనాలను నిలిచిపోతున్నాయి. అప్పటికీ విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు సంబంధించి టోల్‌గేట్లను ఎక్కువగా తెరిచినా వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో టోల్ దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది.

గేట్లు ఎక్కువ పెట్టినా...
ఫాస్ట్ ట్యాగ్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ నిదానంగా వాహనాలు టోల్‌ప్లాజాను దాటుతుండటంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకుని జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి సెలవులకు అందరూ ఒక్కసారిగా సొంతఊళ్లకు బయలుదేరడంతో ఈ రష్ ఏర్పడింది. విజయవాడ వెళ్లే రహదారుల్లో ఉన్న టోల్‌ప్లాజాలలో అన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. వాహనాలు పెరిగిపోవడం, టోల్ ఫీజు సొమ్ము చెల్లించి బయలుదేరడం ఆలస్యం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.


Tags:    

Similar News