జ్ఞానవాపి మసీదు వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన ఇదే
సంబంధిత బావిని సీజ్ చేసి కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘సంబంధిత ప్రాంతాన్ని..
కోర్టు ఆదేశాల మేరకు కాశీలోని విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ప్రముఖ జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ మధ్య విచారణ పూర్తి చేశారు. తొలుత వీడియోలు తీసేందుకు, మసీదు ఆవరణ లోపలకు వచ్చేందుకు మసీదు నిర్వహణ కమిటీ అనుమతించలేదు. దీంతో కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో, గట్టి బందోబస్తు మధ్య శనివారం నుంచి సోమవారం వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కోర్టు నియమించిన కమిషనర్, న్యాయవాదుల బృందం ఈ పనిని పూర్తి చేసింది. మసీదు లోపలి బావిలో శివలింగాన్ని కనుగొన్నట్టు న్యాయవాది విష్ణు జైన్ ప్రకటించారు. సర్వేలో పాలు పంచుకున్న న్యాయవాద బృందంలో ఒకరు విష్ణు జైన్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత బావిని సీజ్ చేసి కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ''సంబంధిత ప్రాంతాన్ని సీజ్ చేయండి. ఏ ఒక్కరినీ అనుమతించొద్దు'' అంటూ జిల్లా కలెక్టర్ కౌషల్ రాజ్ శర్మను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అనుసరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీ యాసిన్ ప్రకటించారు. పిటిషనర్లతో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులు ప్రకటనలు చేస్తుండడం, సర్వే వివరాలను లీక్ చేస్తుండడం ఎంతో బాధకు గురిచేస్తోందని యాసీస్ పేర్కొన్నారు.