భద్రాచలం ఎంత భద్రం?
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 71.1 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 71.1 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది. గోదావవరి ఉధృతితో భద్రాచలం పట్టణంలోకి నీళ్లు చేరాయి. ఐదు కిలో మీటర్ల కరకట్ట భద్రాచలం పట్టణాన్ని రక్షిస్తుంది. లేకుంటే పట్టణం పూర్తిగా మునిగి పోయి ఉండేది. మరింత ఉధృతి పెరిగితే భద్రాచలం పట్టణం మునిగిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే కొంత ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో కొంత ఊరట కల్గించే అంశం.
మూడు రహదారులు..
భద్రాచలం పట్టణానికి మూడు వెళ్లే మూడు రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపైకి ఎవరినీ అనుమతించడం లేదు. కూనవరం, చర్ల, కొత్త గూడెం రోడ్లు నీటితో నిండిపోయాయి. వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఇటు ప్రజలతో పాటు అధికారుల్లో కూడా నెలకొంది. ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. హెలికాప్టర్ ను కూడా సిద్ధం చేసి ఉంచారు. 1986లో సంభవించిన వరద ప్రభావం ఇప్పుడు కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు.