నేడు నీట్ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమయినా?

నీట్ పరీక్షకు అధికారులు అంతా సిద్ధం చేశారు. వైద్య విద్యలో సీట్ల భర్తీ కోసం జరిపే ఈ పరీక్ష ఈరోజు జగరనుంది

Update: 2022-07-17 05:01 GMT

నీట్ పరీక్షకు అధికారులు అంతా సిద్ధం చేశారు. వైద్య విద్యలో సీట్ల భర్తీ కోసం జరిపే ఈ పరీక్ష ఈరోజు జగరనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకూ ఈ పరీక్ష జరగనుంది. గతంలో కంటే మరో ఇరవై నిమిషాలు పరీక్ష గడువు పెంచారు. ప్రస్తుతం ఈ పరీక్ష మూడు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 60 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద....
నీట్ పరీక్ష కోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, ముక్కుపుడకలు, గొలుసులను సయితం తీసేయాల్సి ఉంటుంది. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ నే వినియోగించాలి. మరే పెన్నును వినియోగించకూడదు. పరీక్ష కేంద్రంలోనే వాటిని అధికారులు అందజేస్తారు. విద్యార్థులు 1.30 గంటల కల్లా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.


Tags:    

Similar News