తెలంగాణ రాష్ట్రంలో భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కుట్ర: బండి సంజయ్

ఈ మాట అన్నది మరెవరో కాదు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో భజరంగ్ దళ్‌‌పై నిషేధం విధించేందుకు..

Update: 2023-05-19 05:14 GMT

కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రాగానే భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా భజరంగ్ దళ్ ను బ్యాన్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ మాట అన్నది మరెవరో కాదు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో భజరంగ్ దళ్‌‌పై నిషేధం విధించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఈ విషయంలో కాంగ్రెస్‌‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు. భారత మాతా కీ జై అంటే జైల్లో వేస్తారని, జై శ్రీరాం అంటే కేసులు పెట్టి వేధించే రోజులు రాబోతున్నాయని అన్నారు. భజరంగ్ దళ్‌‌పై నిషేధం విధించాలని ఏ ఒక్క ముస్లిం కూడా కోరుకోవడం లేదు. ఈ సంస్థ ఎక్కడా హింసను ప్రేరేపించలేదు. హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తోంది. అయినా భజరంగ్ దళ్‌‌ను నిషేధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి అని అన్నారు

హైదరాబాద్ లో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా సమ్మేళనానికి హాజరైన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్‌‌తో కలిసి బీసీ డిక్లరేషన్‌‌ను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీల ఎజెండాతోనే ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. కాంగ్రెస్ బీసీల ద్రోహి అని.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీ అని అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ బీజేపీ అని గుర్తుంచుకోవాలని అన్నారు. చాయ్ అమ్ముకునే పేద కుటుంబానికి చెందిన బీసీ వ్యక్తి నరేంద్ర మోదీని ప్రధానిగా చేసిన చరిత్ర బీజేపీదే అని అన్నారు. అగ్ర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.


Tags:    

Similar News