Bathukamma : నేడు అలిగిన బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు నేటికి ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈరోజు అలిగిన బతుకమ్మ వేడుకను నిర్వహించనున్నారు

Update: 2024-10-07 05:53 GMT

తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు నేటికి ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈరోజు అలిగిన బతుకమ్మ వేడుకను నిర్వహించనున్నారు. ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అలిగిన బతుకమ్మతో ఆడటం సంప్రదాయంగా వస్తుంది. ప్రతి గ్రామాన బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మహిళలు అందరూ సాయంత్రం వేళ ఒకటో చేరి బతుకమ్మను చేర్చి ఆటపాటలతో కాసేపు ఆడి తర్వాత వాటిని సమీపంలోని నదిలోనో,కాల్వలోనో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది.

పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
ఈరోజు అలిగిన బతుకమ్మ ఎందుకు చేస్తున్నారంటే? దానికి ఒక కధ చెబుతారు. గతంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగడంతో బతుకమ్మ అలిగిందంటారు. ఈరోజు బతుకమ్మ ఏదీ తినదు. అందుకనే నేడు అలిగిన బతుకమ్మను మహిళలంతా జరుపుకుంటారు. అలక తీరాలని బతుకమ్మను పేర్చి ప్రార్థిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు అలిగిన బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.


Tags:    

Similar News