Bathukamma : నేడు రెండోరోజు...అటుకుల బతుకమ్మ

బతుకమ్మ ఉత్సవాలు నిన్నటి నుంచి తెలంగాణాలో ప్రారంభమయ్యాయి. నేడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు

Update: 2024-10-03 02:25 GMT

Atukula bathukamma

బతుకమ్మ ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. అనేక జిల్లాల్లో పండగ వాతావరణంలో బతుకమ్మను మహిళలు ఒక చోట చేర్చి ఆడి పాడారు. అయితే నేడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజు అటుకులను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్యయుజ శుద్ధ పాడ్యమి రోజ అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. నేటి నుంచి దేవీ నవరత్రులు కూడా ప్రారంభం కానుండటంతో నేటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు.

అటుకులు నైవేద్యం...
మహిళలు వివిధ రకాల పూలను తీసుకు వచ్చి బతుకమ్మను సిద్ధం చేసుకంటారు. సాధారణంగా గతంలో అయితే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే స్నానమాచరించి పూలను సేకరిస్తారు. అనంతరం ఇంటిని శుభ్రం చేసుకుంటారు. తర్వాత అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. రెండో రోజు కావడంతో రెండు వరసల్లో బతుకమ్మను పేరుస్తారు. చిన్నారులకు అత్యంత ఇష్టమైన అటుకులు, బెల్లాన్ని అందిరికీ పంచి పెడతారు. ఈరోజు అటుకుల బతుకమ్మతో రాత్రికి ఆడి పాడి.. తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు.

Tags:    

Similar News