Telangana : ఆరు గ్యారంటీల్లో అమలయింది ఎన్నంటే? వాటి మీద జనం ఏమనుకుంటున్నరంటే?

తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది

Update: 2024-12-31 05:27 GMT

తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఇప్పటి వరకూ ఆరు గ్యారంటీలలో ఎన్ని అమలయ్యాయి? దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది. ఆరు గ్యారంటీలతోనే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ముక్తకంఠంతో నేతలందరూ చెప్పడంతో జనం కూడా నమ్మారు. కానీ అందులో కొన్నింటిని ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే అమలు చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత వేగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అందరూ భావించారు.

అమలయ్యాయి కానీ...
డిసెంబరు 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం సూపర్ సక్సెస్ అయింది. ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టిందంటున్నారు. అత్యంత వేగంగా ఈ పథకాన్ని గ్రౌండ్ చేయడంతో ఇక ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని అందరూ భావించారు. కానీ తర్వాత హామీల అమలులో కొంత ఆలస్యం జరిగింది. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తుకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదంటున్నారు. ఎందుకంటే చాలా మందికి ఈ పథకం అందడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఎక్కువ మందికి ఈ పథకంలో కోత పెట్టారన్న విమర్శలు కూడా బాగానే వినిపిస్తున్నాయి.


కొందరికే అందడంతో...
ఇక రైతులకు రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీ కూడా సక్రమంగా అమలుకాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు లక్షల రుణం కొందరికే అందిందని, అందరికీ అందలేదని అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు కూడా దిగారు. తాజాగా రైతు భరోసా నిధులను కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. దీనిపై విధివిధానాలు ఇంకా నిర్ణయించలేదు. కానీ అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ పథకం కింద కూడా అందరికీ అందేది లేదన్నది అర్థం అవుతుంది. కొందరికిపెట్టి మరికొందరికి గతంలో వచ్చేసొమ్ములు రాకుంటే వారంతా వ్యతిరేకమయ్యే అవకాశముందన్నఆందోళనవ్యక్తమవుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. పథకాలను అమలు చేస్తున్నారు సరే.. అందరికీ కాకుండా కొందరికే అందడంపై పార్టీలోనే కొంత అసంతృప్తులు వినపడుతున్నాయి.

ఆరు గ్యారంటీలివే...

01. మహాలక్ష్మి పథకం
ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ - అమలు చేశారు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - అమలు చేశారు
మహిళలకు నెలకు రెండు వేలు - అమలు కాలేదు
02. రైతుల కోసం
వరి రైతులకు ఐదు వందల బోనస్ - అమలు చేశారు
రెండు లక్షల రుణ మాఫీ - అమలు చేశారు
రైతు భరోసా - సంక్రాంతికి అమలు
03. గృహజ్యోతి
ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు విద్యుత్తు ఉచితం - అమలు చేశారు
04. పేదల కోసం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - సంక్రాంతి నుంచి అమలు
05. యువ వికాసం
ఐదు లక్షల విద్యాభరోసా కార్డు - అమలు చేయాలి
06. వృద్ధుల కోసం
పింఛనును నాలుగు వేలకు పెంపు - అమలు చేయాలి

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News