ఈ యువతికి ఒకేసారి మూడు ప్రభుత్వోద్యాగాలు
జగిత్యాలకు చెందిన జయ తొలి నుంచి చదువల్లో రాణించే వారు
ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడం కష్టంగా మారిన ఈరోజుల్లో ఒక యువతికి మూడు ప్రభుత్వోద్యాగాలు రావడం అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇప్పుడు ఆ యువతి ఏ ఉద్యోగంలో చేరాలన్నది నిర్ణయించుకోవడమే. చదువుల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటి తలుపులు అవే తడతాయని జయ నిరూపించింది. జగిత్యాలకు చెందిన జయ తొలి నుంచి చదువల్లో రాణించే వారు. బాసర ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరంగ్ పూర్తి చేసి అనంతరం జేఎన్‌టీయూలో ఎంటెక్ పూర్తి చేసిన జయ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లక్ష్యం అదే....
వరసగా పరీక్షలు రాస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అందులో ఆమె సక్సెస్ అయ్యారు. ఒకేసారి పంచాయతీరాజ్ ఏఈఈ, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టలుకు జయ ఎంపికయ్యారు. అయితే తాను పంచాయతీరాజ్ లోని ఏఈఈ పోస్టులో చేరేందుకు ఇష్టపడతున్నానని జయ చెప్పారు. జయది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామం.