నేడు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు
ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ఈ నెల 7వ తేదీన ప్రారంభమయింది. ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సాదాసీదాగానే నామినేషన్ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నిర్వహించనుంది.
భారీ ర్యాలీతో...
అలాగే ఉదయం 11 గంటలకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. మునుగోడు నుంచి చుండూరు వరకూ ఈ సందర్భంగా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.