BJP : బీఆర్ఎస్ పని అయిపోయింది
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.;
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఇండియన్ పొలిటికల్ లీగ్ లో బీజేపీ కెప్టెన్ మోదీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
బీఫాం తీసుకుని...
బీఆర్ఎస్ లో బీఫామ్ తీసుకున్నా ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారంటే అంతకంటే ఆ పార్టీ గురించి వేరే చెప్పాలా? అని ప్రశ్నించారు. కరీంనగర్ లో స్మార్ట్ సిటీ ఏర్పాటు కోసం బీజేపీ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ జరుగుతుందన్న బండి సంజయ్ బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఎన్ని యాత్రలు చేసినా జనం నమ్మరంటూ ఆయన ధ్వమెత్తారు.