ఇప్పుడు పీకే అవసరం ఏమొచ్చింది?
ఓటమి ఎరుగని కేసీఆర్ కు ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరమేమొచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
ఓటమి ఎరుగని కేసీఆర్ కు ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరం ఏమొచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 1985 నుంచి మొన్నటి వరకూ కేసీఆర్ ఓటమి ఎరుగడని, అలాంటి కేసీఆర్ ఇప్పుడు పీకే వెంట పడుతున్నాడని ఈటల అన్నారు. ప్రజల నాడి తెలిసిపోయే ఈసారి ఓటమి తప్పదని గ్రహించిన కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించారని ఆయన ఎద్దేవా చేశారు.
పీకే కన్నా.....
తెలంగాణ ప్రజలు ప్రశాంత్ కిషోర్ కన్నా మేధావులని ఈటల రాజేందర్ అన్నారు. అందుకే దుబ్బాకలో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలిచినా మోటార్లు రాలేదని, రేపు అధికారంలోకి వచ్చినా మోటార్లు రావని ఈటల స్పష్టం చేశారు. కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతూ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.