BJP : నేడు వరద ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటన

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు;

Update: 2024-09-05 04:12 GMT
bandi sanjay, union minister, flood affected areas, khammam district
  • whatsapp icon

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ లురెండు బృందాలుగా ఏర్పడి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారనిపార్టీ వర్గాలు వెల్లడించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరి పర్యటన ఉంటుందని బీజేపీ నేతలు చెప్పారు.

రెండు బృందాలుగా...
కేంద్ర మంత్రి బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుందని తెలిపారు. ఈటెల రాజేందర్ బృందం ములుగు, మహబూబాబాద్‌లో పర్యటిస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వరద ప్రాంతాల్లో పర్యటించి వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయంపై ఈ బృందం ఆరా తీస్తుంది. నష్టం వివరాలను తెలుసుకుంటుంది.


Tags:    

Similar News