సభ నుంచి ఈటల సస్పెన్షన్
బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ ను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.
బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ ను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ శాసనసభ చివరి రోజు సమావేశాలు ప్రారంభమయిన వెంటనే ఈటల రాజేందర్ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ కు క్షమాపణలు చెప్పి, ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాతనే మాట్లాడాలని కోరారు. స్పీకర్ కూడా మూడ్ ఆఫ్ ది హౌస్ ను బట్టి స్పందించాలని కోరారు.
వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోవడంతో...
అయితే తనకు 19 ఏళ్ల శాసనసభ్యుడిగా అనుభవం ఉందని చెప్పారు ఈటల రాజేందర్. స్పీకర్ తనకు తండ్రి లాంటి వారని ఆయన అన్నారు. అయినా వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోవడంతో ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రతిపాదించారు. స్పీకర్ ను మరమనిషి అని వ్యాఖ్యానించి క్షమాపణ చెప్పకుండా, సభ నుంచి సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్లి అల్లరి చేయాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సెషన్ మొత్తానికి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు.