ఇంకొంచెం కష్టపడితే 'మనదే' అన్నారు ప్రధాని : డాక్టర్ లక్ష్మణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా కలిశారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా కలిశారు. ప్రధాని మోదీని కలిసిన విషయమై ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలో తెలంగాణ పైన వేస్తున్న ప్రశ్నలు, పాల్గొంటున్న చర్చలు బాగుంటున్నాయని.. అలాగే కొనసాగించాలని ప్రధాని తనతో అన్నట్లు లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సాక్షిగా ఒక్కటైన విషయం ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించాలని ప్రధాని సూచించినట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వెంట ఉన్నారని.. మరి కొంచెం కష్టపడితే అధికారంలోకి వస్తామని, తెలంగాణ పర్యటనకు విస్తృతంగా వస్తానని మోదీ అన్నారని లక్ష్మణ్ తెలిపారు.
కరుడుగట్టిన కాషాయవాదిగా పేరున్న లక్ష్మణ్.. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. రెండు సార్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కూడా చేపట్టారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.