కేసీఆర్ మాయ మాటలను నమ్మొద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు.;

Update: 2021-12-27 07:34 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు. కేసీఆర్ తన ఇంట్లో వాళ్లకు తప్పించి ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నిరుద్యోగ దీక్షలో తరుణ్ చుగ్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తున్నారన్నారు. ఈసారి కేసీఆర్ మాయమాటలను ప్రలజు నమ్మరని తరుణ్ చుగ్ అన్నారు.

ఏడేళ్లుగా....
నిరుద్యోగులకు ఏడేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. అధికారంలోకి రావడానికి సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. నిరుద్యోగుల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని తరుణ్ చుగ్ హెచ్చరించారు.


Tags:    

Similar News