దగ్గుబాటి నిర్మాత, హీరోలపై కేసు నమోదు...!!!

హీరో వెంకటేష్‌, నిర్మాత సురేష్‌ బాబు, హీరో రానాలపై కేసు నమోదైంది. ల్యాండ్‌ వివాదంలో నాంపల్లి కోర్ట్ సీరియస్‌ అయ్యింది.;

Update: 2025-01-12 09:48 GMT

హీరో వెంకటేష్‌, నిర్మాత సురేష్‌ బాబు, హీరో రానాలపై కేసు నమోదైంది. ల్యాండ్‌ వివాదంలో నాంపల్లి కోర్ట్ సీరియస్‌ అయ్యింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది..!!మరో రెండు రోజుల్లో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కావడం ఆశ్చర్యపరుస్తుంది.

"ఫిల్మ్ నగర్ లోని దెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబానికి చెందిన హీరోలు వెంకటేష్,రానా, నిర్మాత సురేష్ పై కేసు నమోదు చేశారు ...!!""కోర్టులో దీనిపై వాదనలు నడుస్తున్న తరుణంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఆ హోటల్ ని కూల్చివేయడం ఈ వివాదాస్పద ఘటనకు దారి తీసింది..!!!నంద కుమార్ అనే వ్యక్తి ఓ స్థలంలో దక్కన్ కిచెన్ అనే హోటల్ నిర్వహిస్తున్నాడు... అయితే ఆ హోటల్ ఉన్న స్థలం తమది అని దగ్గుబాటి కుటుంబం, కాదు మాది అని నంద కుమార్ అంటున్నారు..!!


అయితే రెండేళ్ల క్రితమే(2022 నవంబర్‌)లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ని పాక్షికంగా కూల్చేశారు.దీంతో నాంపల్లిలోని సిటీ సివిల్‌ కోర్ట్ ని నంద కుమార్ ఆశ్రయించగా, ఈ కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై హైకోర్ట్ ని ఆశ్రయించగా, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.హైకోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం హోటల్‌ మొత్తాన్ని కూల్చేశారు.దీంతో కోర్టు ఆదేశాలను పాటించని దగ్గుబాటి కుటుంబంపై FIRనమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17 వ నంబరు కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది..!!

కోర్టు ఆదేశాలతో...హీరో దగ్గుబాటి వెంకటేష్‌, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్ల పై FIR నమోదు చేసి విచారణ చేపట్టారు..!!

Tags:    

Similar News