హైదరాబాద్ లో 13 వ తేదీ నుండి 15 వరకు కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు..!!!

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా సికింద్రాబాద్ వద్ద 13 నుంచి 15 వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి..!!;

Update: 2025-01-12 11:05 GMT

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా సికింద్రాబాద్ వద్ద 13 నుంచి 15 వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి..!!

రోటరీ ' X ' రోడ్ నుంచి SBHకు వెళ్లే దారి.. YMCA నుంచి క్లాక్ టవర్‌కు మళ్లింపు చేస్తున్నారు.రసూల్‌పురా నుంచి ప్లాజాకు వెళ్లే దారి.. CTO ‘X’ రోడ్స్ నుంచి బలంరాయికి మళ్లింపు చేస్తున్నారు.

పికెట్ నుంచి SBH & టివోలికి వెళ్లే మార్గం.. స్వీకార్ ఉపకర్ వద్ద YMCAకు మళ్లిస్తున్నారు.NCC నుంచి ప్లాజాకు వెళ్లే మార్గం.. టివోలి వద్ద నుంచి బ్రూక్‌బాండ్‌కు మళ్లిస్తున్నారు.

గేట్ నం.1 నుంచి పబ్లిక్ ఎంట్రీకి అనుమతి..ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌కి వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News