ఆ విషయం లో ఫస్ట్ ప్రియారిటీ హైదరాబాద్ వాళ్ళకే....!!!పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..!!

హైదరాబాద్ లో స్థలం ఉండి..,ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లకు అభ్యర్థులు ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని.. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు...!!!;

Update: 2025-01-12 08:37 GMT

హైదరాబాద్ లో స్థలం ఉండి..,ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లకు అభ్యర్థులు ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని.. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు...!!!

బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ "" ఇందిరమ్మ ఇళ్లకు లబ్ది దారుల ఎంపిక మరియు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై "" జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో

అధికారులు,లోకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..!!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు..!!

ఈ నెల 21 నుంచి అర్హులైన వారి వివరాలను డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో స్థలం ఉండి,ఇళ్లు లేని వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వడమే తన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ మహా నగరానికి వలస వచ్చిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Tags:    

Similar News