పోలీసు అదుపులో బండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు వెళుతుండగా మలక్‌పేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంతో కార్యకర్తలు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
మునుగోడు వెళుతుండగా...
మలక్ పేట్ నుంచి పోలీసులను తప్పించుకుని వెళ్లిన బండి సంజయ్ ను రామోజీ ఫిలిం సిటీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్ ను ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడులో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని ముందుగానే ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ తో జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.