కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం
కేసీఆర్ కుటుంబ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ వసూళ్లకు భయపడి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నాయని తెలిపారు. ఇక్కడ నీరు, గాలి పూర్తిగా కలుషితమైందని తెలిపారు. వర్షమొస్తే హైదరాబాద్ మునిగి పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయన్నారు. సెప్టంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపితీరుతామని ఆయన తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికపై....
అసోం ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేని దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ మండి పడ్డారు. ధర్మ, సమాజం కోసం బీజేపీ ఎప్పుడూ పోరాడుతుందని ఆయన అన్నారు. ఎంఐఎం నేతలపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. దారుసలాం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టంబరు 17నుంచి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతామని అన్నారన్నారు. నాటి నిజాం వారసులే నేటి ఎంఐఎం నేతలని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆయన అన్నారు. మునుగోడులో విజయం తమదేనని, ఆర్ఆర్ఆర్ కు తోడు మరో ఆర్ ను జోడిస్తామని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు.